ఘనంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు

 

ప్రజాబలం మందమర్రి మండల రిపోర్టర్ డిసెంబర్ 3

మందమర్రి ఏరియాలోని సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ లో గల మనోవికాస్ స్కూల్ లో మంగళవారం నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధి గా జి.ఎం జి.దేవేందర్ హాజరయ్యారు. డిసెంబర్ 3 అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడలలో గెలుపొందిన విద్యార్థిని,విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని దివ్యాంగుల పిల్లల మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎంతో ఓపికతో ఎంతో శ్రమకు ఓర్చి ఇలాంటి పిల్లలకు చదువు చెప్పడం, కొన్ని పనులలో నేర్పరులనుగా చేయడం, ఇక్కడ వారికి శిక్షణ ఇస్తున్న ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు, ఆయాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు. దివ్యాంగులు చాలా శక్తివంతమైన వారిని వారిలో ఏదో తెలియని శక్తి దాగి ఉందని దానిని వెలికి తీసి ప్రోత్సహించాలని ఆయన సూచించారు. అలాగే మనోవికాస్ స్కూల్ పిల్లలకు మన సింగరేణి ఉద్యోగులు కూడా సహకరిస్తున్నరని, ఇంకా ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడుతున్న అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఆటల పోటీల లో గెలుపొందిన వారికి బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి మందమర్రి ఏరియా బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, పర్సనల్ మేనేజర్ ఎస్.శ్యాంసుందర్, డి.వై పి.ఎం శ్రీ,ఎం.డి ఆసిఫ్, శ్రీమతి టి. సురేఖ, (మనోవికాస్ స్పెషల్ స్కూల్ మందమర్రి ఇంచార్జ్), శ్రీ టి.రాజలింగు,(పేరెంట్స్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ మందమర్రి), తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking