ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్,అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలని అన్నారు.
క్యాంటీన్ లో నాణ్యమైన ఆహారాన్ని సరసమైన ధరలకు అందించాలని సూచించారు.మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.