ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 03 : మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండలం ముల్కల్లలో గల ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతా ఏర్పాట్లను హాజీపూర్ మండల తహశిల్దార్ శ్రీనివాస్ రావు దేశ్పాండేతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం, మంచిర్యాల,బెల్లంపల్లి, చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని, సి.సి.కెమెరాల ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.