ప్రజాబలం మందమర్రి మండల రిపోర్టర్ డిసెంబర్ 3 :
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా మున్సిపల్ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ చెన్నూరు శాసనసభ్యులు శ్రీ నల్లాల ఓదెలు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నోముల ఉపేందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ సొత్కు సుదర్శన్ గా ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా కార్యాలయం నుండి మున్సిపల్ కమిషనర్ శ్రీ ఇన్ వెంకటేశ్వర్లు మున్సిపల్ ఇంజనీర్ శ్రీమతి సుమతి, మున్సిపల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ సందీప్, మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ సి పి కృష్ణ ప్రసాద్ లు పాల్గొన్నారు. అనంతరం కార్యాలయం నందు ఆరోగ్య సిబ్బందిచే పారిశుద్య కార్మికులకు హెల్త్ క్యాంప్ నిర్వహించారు. పారిశుధ్య కార్మికులకు పిపీఈ కిట్స్ ( ఆఫ్రాన్స్ గన్ షూస్ హ్యాండ్ గ్లౌజులు,సబ్బులు,నూనెలు, ప్రశంసా పత్రములతో సత్కరించారు. ఎస్ హెచ్ జి గ్రూప్ సభ్యులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ మరియు ఫీల్డ్ ఆఫీసర్, మాజీ శాసనసభ్యులు నల్లాల ఓదెలు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిలిగొండ వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం. సుమతి, రెవెన్యూ ఆఫీసర్ పి. కృష్ణ ప్రసాద్, మున్సిపల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్. సందీప్, శానిటరీ ఇన్స్పెక్టర్ వి. శ్యాంసుందర్, హెల్త్ అసిస్టెంట్ ఎం. ఏ. సమీర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఏ. నాగిరెడ్డి, సీనియర్ అసిస్టెంట్లు ఏ. రాణి, బి శ్రీనివాస్, బి. లక్ష్మీరాజు, జి. రాజేందర్, మెప్మా టౌన్ కో ఆర్డినేటర్ ఏనుగు రఘురాం, 24 వార్డుల రిసోర్స్ పర్సన్లు మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు.