ఘనంగా ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీ

మహిళా సంఘ సభ్యులకు చెక్కు పంపిణి

మునిసిపల్ కార్మికులకు సన్మానం..

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి డిసెంబర్ 3

జమ్మికుంట మునిసిపాలిటి అధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా అర్బన్ డే కార్యక్రమం సందర్బంగా మంగళవారం ర్యాలి నిర్వహించారు. ముందుగా మునిసిపల్ చైర్మెన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు, మునిసిపల్ కమీషనర్ మొహమ్మద్ ఆయాజ్ లు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పాత మునిసిపల్ కార్యాలయం నుండి సుమారు 650 మంది సంఘ సభ్యులు, మునిసిపల్ సిబ్బందితో కలిసి పట్టణ పురవీదుల గుండా సువర్ణ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలి నిర్వహించారు. అనంతరం మహిళా సంఘ సభ్యులు ఏర్పాటు చేసిన స్టాల్ల్స్ ను సందర్శించి, వారిని అభినందించారు.

తదనంతరం ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిదిగా హాజరైన రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ పి శ్రీధర్, మునిసిపల్ చైర్మెన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు, మునిసిపల్ కమీషనర్ అయాజ్ లు మాట్లాడుతూ రాష్ట్రంలో 139 మునిసిపాలిటిలలో ఎక్కడ చేయలేని కార్యక్రమాలు పారిశుధ్య కార్మికులకు ఇన్సూరెన్స్, ఈ ఎస్ ఐ కార్డుల పంపిణి, హెల్త్ కార్డుల పంపిణి వంటి ఎన్నో కార్యక్రమాలు జమ్మికుంట మునిసిపాలిటి నిర్వహిస్తుందని అయన అన్నారు. పారిశుధ్య కార్మికుల ఆరోగ్యమే పట్టణ ప్రజల ఆరోగ్యం అని ఉద్దేశంతో ఈహెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగిందన్నారు. పట్టణంలో పారిశుధ్య కార్మికులు వెన్నుపూస లాంటివారని, వారు లేకపోతే పట్టణ అభివృద్ధి జరగదని వారు అన్నారు.

ఈ కార్యక్రమలో ఐఎం.ఏ అధ్యక్షులు డాక్టర్ సుధాకర్ అధ్వర్యంలో 14 మంది వైద్యులతో హెల్త్ క్యాంపు నిర్వహించగా, కార్మికులు, సంఘ సభ్యులు ఆర్థో, ఫిజిషేయన్, సర్జన్ లకు చెందినా వైద్యులు పరీక్షించి, పరిక్షలు నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న 12 మంది కార్మికులకు, 4 వాటర్ సప్లై వర్కర్స్, 5 సంఘ సభ్యులకు, ఇద్దరు వార్డ్ ఆఫీసర్లకు, సానిటరీ ఇన్స్ పెక్టర్ సదానందం, కంప్యూటర్ ఆపరేటర్ కుమార్, ఇద్దరు బిల్ కల్లెక్టర్లకు, టౌన్ ప్లానింగ్ చైన్మెన్, ఇద్దరు అటెండర్లకు సన్మానం చేసారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మెన్ దేశిని స్వప్న కోటి, మునిసిపల్ మేనేజర్ జి రాజిరెడ్డి, ఏఈ నరేష్, జూనియర్ ఎకౌంటు ఆఫీసర్ రాజశేఖర్ రెడ్డీ, హెల్త్ అసిస్టంట్ మహేష్, సీనియర్ అస్సిస్టంట్ భాస్కర్, వాణి, ఇంచార్జ్ టి.ఎం.సి. మానస, ఎన్విరాన్మేంట్ ఇంజనీర్ శ్రీకాంత్, మునిసిపల్ కౌన్సిలేర్లు, సిఎల్ అర్పిలు, అర్పిలు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, జవాన్లు, పారిశుధ్య కార్మికులు పలువురు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking