శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు

పోలీస్ కమీషనర్ ఐపిఎస్ ఐజీ ఎం.శ్రీనివాస్

ముఖ్యమంత్రి పర్యటన సందర్బంగాట్రాఫిక్ అడ్వైజరి..

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 03 : తేది 04-12-2024 రోజున పెద్దపల్లి లో గ్రూప్ -IV అభ్యర్థులకు నియామక పత్రాల అందచేత,పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల నేపధ్యంలో గౌరవ ముఖ్యమంత్రి పర్యటన సందర్బంగా సామాన్య ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ సమస్య కలగకూడదని ప్రజల సౌకర్యార్థం ముందస్తుగా ట్రాఫిక్ డైవర్షన్స్ గురించి పోలీస్ వారి సూచనలు ఇవ్వడం జరుగుతుంది కావున రేపు తేది 04-12-2024 ఉదయం నుండి ట్రాఫిక్ డైవర్షన్స్ ఏర్పాటు చేయడం జరుగుతోంది కావున ప్రజలందరూ సహకరించగలరని విజ్ఞప్తి.10 గంటల నుండి ముఖ్యమంత్రి గారి పర్యటన ముగింపు వరకు ప్రజలు కింద తెలిపిన మరియు ఇతర ప్రత్యామ్నాయ రవాణా మార్గాలు చూసుకోవాలని పోలీస్ వారి సూచన.
ట్రాఫిక్ డైవరషన్ లు రామగుండం నుండి కరీంనగర్ వైపు వెళ్ళు అన్ని వాహనాలు ధర్మారం-ఎక్స్ రోడ్(బసంత్ నగర్) ద్వారా కుక్కలగూడూరు, రాజారాంపల్లి, ధర్మారం,చొప్పదండి ద్వారా కరీంనగర్ వైపు వెళ్ళాలి. మంథని వైపు నుండి కరీంనగర్ వైపు వెళ్ళు భారీ వాహనాలు అప్పన్నపేట, ధర్మారం-ఎక్స్ రోడ్(బసంత్ నగర్) ద్వారా కుక్కలగూడూరు, రాజారాంపల్లి, ధర్మారం,చొప్పదండి ద్వారా కరీంనగర్ వైపు వెళ్ళాలి.మంథని వైపు నుండి కరీంనగర్ వైపు వెళ్ళు 4 వీలర్లు అప్పన్నపేట నుండి ఎడమ వైపు తీసుకుని బొంపల్లి, దొంగతుర్తి,ధర్మారం, చొప్పదండి ద్వారా కరీంనగర్ వైపు వెళ్ళాలి. కరీంనగర్ నుండి రామగుండం, మంథని వైపు వెళ్ళు భారీ వాహనాలు ముగ్దుంపూర్-ఎక్స్ రోడ్ నుండి కరీంనగర్-లక్షెట్టిపేట రోడ్ ద్వారా చొప్పదండి,ధర్మారం, రాజారాంపల్లి వద్ద కుడి వైపు తీసుకుని కుక్కలగూడూర్, ధర్మారం-ఎక్స్ రోడ్ ద్వారా రాజీవ్ రహదారి (కరీంనగర్-రామగుండం)కు చేరుకుని రామగుండం, మంథని వైపు వెళ్ళాలి.కరీంనగర్ నుండి పెద్దపల్లి, రామగుండం వైపు వచ్చే 4 వీలర్ లు సుల్తానాబాద్ మండలం నారాయణపూర్-ఎక్స్ రోడ్ నుండి నారాయణపూర్, కోదురుపాక, నిమ్మనపల్లి,పెద్దపల్లి సాగర్ రోడ్, జూనియర్ కాలేజ్ రోడ్(ఎమ్ బీ గార్డెన్ రోడ్), అయ్యప్ప జంక్షన్ ద్వారా రామగుండం మరియు మంథని వైపు వెళ్లవచ్చు.
గౌరవ ముఖ్యమంత్రి పర్యటన సందర్బంగా ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా కార్యక్రమాలు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని రామగుండము పోలీస్ కమీషనర్ ఐపిఎస్ ఐజీ ఎం. శ్రీనివాస్ హెచ్చరించారు. చట్టవ్యతిరేక, ప్రజా శాంతికి,శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు.ఎలాంటి సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణం ఉండాలని అన్ని వర్గాల ప్రజలు శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులతో సహకరించాలని సిపి గారు కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking