– హెల్త్ మినిస్టర్ దామోదరకు సబ్బని వెంకట్ వినతి
– నియోజకవర్గ పరిధిలో గుండె వైద్య నిపుణుల కొరత
– త్వరలో నియమిస్తామని మంత్రి రాజనర్సింహ హామీ
హుజురాబాద్ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి డిసెంబర్ 3
హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో సమస్యలపై ప్రముఖ సామాజికవేత్త, మల్టీ నేషనల్ కంపెనీ ‘జెన్ ప్యాక్ట్’ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ సబ్బని వెంకట్ తన గళం వినిపిస్తున్నారు. ఇటీవల జమ్మికుంట సివిల్ హాస్పిటల్ ను సందర్శించి వసతుల కల్పన, వైద్య నిపుణుల కొరత గురించి వెంకట్ వాకబు చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో గుండె వైద్య నిపుణుల కొరత, ఆవశ్యకత గురించి తెలుసుకుని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహాను కలిసి మంగళవారం వినతి పత్రం సమర్పించారు.
గోల్డెన్ అవర్‌లో ట్రీట్‌మెంట్ అందించేందుకు కార్డియలజిస్టుల అవసరముందని వివరించారు. నియోజకవర్గ పరిధిలో గుండె వైద్య నిపుణులను నియమించాలని కోరారు. తనతో ఉన్న సన్నిహిత్యం కారణంగా మంత్రి సానుకూలంగా స్పందించారని.. త్వరలో అధికారులతో మాట్లాడి గుండె వైద్య నిపుణులను నియమిస్తానని హామీ ఇచ్చారని సబ్బని వెంకట్ వెల్లడించారు. హుజూరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో విద్య, వైద్యం, ఉపాధి కల్పనకు తన వంతుగా కృషి చేస్తూనే.. ప్రభుత్వాల పరంగా చేయాల్సిన విషయాలపై సామాజికవేత్త తన వాయిస్ వినిపిస్తున్నారు. ప్రజల పక్షాన ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్తూ.. పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నారు. యువతను క్రీడల్లో ప్రోత్సహించడానికి సైతం సబ్బని వెంకట్ ఆర్థిక సాయం చేస్తున్నారు.