ఘనంగా కాళోజి 110 జయంతి వేడుకలు

తెలుగు సాహితీ రంగానికి ప్రజాకవి కాళోజీ చేసిన సేవలు మరువలేనివీ..

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

ప్రజా బలం దినపత్రిక మెదక్ జిల్లా ప్రతినిధి
09-09-2024:

మెదక్ జిల్లాలో కాళోజి110 జయంతిని పురస్కరించుకుని సోమవారం ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లతో కలిసి ఆయన పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కాళోజి చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళోజి జయంతిని ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించినట్లు తెలిపారు.

 


,తెలంగాణ ప్రాంతంలోని ఎంతో మంది కవులకు స్ఫూర్తినిచ్చిన దార్శనీకుడు కాళోజీ నారాయణ రావు అని, తెలంగాణ భాషా పరిరక్షణకు కృషి చేయడంతో పాటు తన కవితల ప్రజల్లో ఉద్యమ చైతన్యం నింపిన మహనీయుడుగా అభివర్ణించారు.భారత దేశ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ తో సన్మానింప బడిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు స్ఫూర్తిని ప్రజలు కొనసాగించాలని కోరారు.
కాళోజి నారాయణరావు స్ఫూర్తిని ప్రజలు కొనసాగించాలని కోరారు.తెలంగాణ భాష, యాస వేళాకోళానికి గురైతే బాధపడి, ప్రత్యేక తెలంగాణను సమర్ధించి పోరాటం చేశారన్నారు. కాళోజి గొప్ప మానవతావాది, వైతాళికుడని, స్వచ్ఛమైన మనిషి అని కొనియాడారు
ఈ సమావేశంలో బీసీ సంక్షేమ అధికారి నాగరాజుగౌడ్ ముఖ్య ప్రణాళిక అధికారి మాన్య తెలంగాణ రచయితల సంఘం మెదక్ జిల్లాఅధ్యక్షురాలు కవిత, సెక్రెటరీ సంతోష్,అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking