ఈ నెల 10న జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమం 11వ తేదిన జరుగుతుంది
జిల్లా కలెక్టరు గౌతం
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సెప్టెంబర్ 9:
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో హైదరాబాదులోని మహాత్మ జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో మంగళవారం నిర్వహించే ప్రజా వాణి కార్యక్రమం వాయిదా వేసి బుధవారం, అనగా ఈ నెల 10న జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమం 11వ తేదిన జరుగుతుందని మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు గౌతం తెలిపారు. మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా ప్రజలు ఏవైనా అర్జీలు ఇచ్చేవారు ఇట్టి మార్పును గమనించి మంగళవారానికి బదులుగా బుధవారం వెళ్లాలని కలెక్టర్ సూచించారు.