మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సెప్టెంబర్ 9:
ప్రజావాణిలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం జిల్లా అధికారులను ఆదేశించారు.
సోమవారం మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అదనపు కలెక్టరు విజయేందర్ రెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టురు మాట్లాడుతూ జిల్లా అధికారులు ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను జాప్యం లేకుండా పరిష్కరించాలని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో 89 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో డిఆర్ఓ హరిప్రియ, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Prev Post
Next Post