ఘనంగా కాళోజి జయంతి

కాళోజి ఆశయాలు భవిష్యత్ తరాలకు ఆదర్శం

మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సెప్టెంబర్ 9:
ప్రజల కోసం నిత్యం పరితపించిన కవితామూర్తి కాళోజి ఆశయాలు భవిష్యత్ తరాలకు ఆదర్శమని మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అన్నారు.
మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా యువజన మరియు క్రీడా శాఖ ఆధర్యంలో ఏర్పాటు చేసిన కాళోజీ జయంతిని పురస్కరించుకొని అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టరు మాట్లాడుతూ పుట్టుక నీది, చావు నీది బతుకంతా దేశానిది అన్న కాళోజి మాటలు అందరికి ఆదర్శమని అన్నారు. తెలంగాణ ప్రజల కోసం తన కలం ద్వారా తెలంగాణ భాష, యాస ఎంత మంచిగుంటుందో రాసి మరీ చూపించారని అదనపు కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ హరిప్రియ, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking