మణికొండ ప్రజాబలం ప్రతినిధి:బీ ఆర్ ఎస్ నాయకురాలు, మాంగల్యం ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్ పర్సన్, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డా: బత్తిని కీర్తి లతా గౌడ్ ఆధ్వర్యంలో భారత దేశ మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సేవకురాలు, మహిళలకు స్ఫూర్తి ప్రదాత సావిత్రిబాయి జ్యోతిరావు పూలే 192 వ జయంతి సందర్భంగా మణికొండ, పుప్పాలగూడ, నె నేక్నంపూర్, వీకర్ సెక్షన్ ప్రధానోపాధ్యాయులు నిరంజన్, మాంగ్య నాయక్, నిర్మల సహకారంతో మహిళ ఉపాధ్యాయినిలకు సన్మాన కార్యక్రమం మంగళవారం 2023 జనవరి 03 రోజున మణికొండ జడ్ పీ హెచ్ ఎస్ స్కూల్ ఆవరణలో జరిగినది.
ఇట్టి కార్యక్రమంలో అతిథులుగా హాజరైన సినీ రంగ ప్రముఖులు మానుకోట ప్రసాద్ మరియు లావణ్యలు సావిత్రిబాయి పూలే త్యాగాలను అలనాటి పరిస్థితులను తమ పాటల ద్వారా విచ్చేసిన అతిథులకు, ఉపద్యాయ ఉపద్యానీలకు, పిల్లలకు శ్రవనానందం గావించినారు, తదుపరి ప్రదనోపాద్యులిద్దరు, ముఖ్య అతిథిలు బీ ఆర్ ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కే. రామకృష్ణ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు రూపా రెడ్డి, బీ ఆర్ ఎస్ నాయకుడు ఏర్పుల కుమార్, ఉపాధ్యాయురాలు సరిత, సావిత్రిబాయి పూలే అనుభవాలను, అనుభవించిన కష్టాలను, త్యాగాలను కళ్ళకు కట్టినట్లు వివరించి విద్యార్థినీ విద్యార్థులు ఆమే యొక్క ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని సూచించిన్నారు, ఇట్టి శుభ కార్యక్రమంలో మనికొండ మునిసిపల్ కౌన్సిలర్లు చవాన్ వసంత్ రావు, ఆలస్యం నవీన్ కుమార్, బుద్దొల్ కావ్య శ్రీరాములు, మీనా ముత్యాలు, వందనా, శ్వేత, కో ఆప్షన్ మెంబర్ లక్ష్మి ,బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీరాములు, సీనియర్ నాయకులు బషీర్, అందె లక్ష్మణ్ రావు, జయరాజ్, రాజేంద్ర ప్రసాద్, లక్ష్మణ్ గంగాధర్ శాస్త్రీ, దిలీప్, శ్రావణ్, యలాల కిరణ్, శ్రీకాంత్, మహిళా నాయకురాల్లు శివ గంగా, విజయ లక్ష్మీ, డాక్టర్ ప్రభావతి, విద్యార్థి విద్యార్థినీలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Prev Post