నిర్మల్‌ జిల్లా బైంసా పట్టణంలో సంచలనం సృష్టించిన ఐదుగురి హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదీతో పాటు 25 వేల రూపాయల జరిమానా..

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్‌ జిల్లా.. నిర్మల్‌ జిల్లా,జనవరి,03నిర్మల్‌ జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మర్డర్‌ కేస్‌ కు సంబంధించిన వివరాలను ఎస్పీ శ్రీ.సిహెచ్‌.ప్రవీణ్‌ కుమార్‌ ఐపిఎస్‌., వెల్లడిరచారు..

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బైంసా పట్టణంలో 2013 వ సంవత్సరంలో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగగా దానికి సంబంధించిన కేసులో ఒక కుటుంబం ఫిర్యాదు చేయడంతో ప్రత్యర్థి కుటుంబం వారికి కోర్టు శిక్ష విధించింది దీంతో కక్షగట్టిన ప్రత్యర్థి కుటుంబం వారు 2016 వ సంవత్సరం మే నెల 5వ తేదీన నిర్మల్‌ బైంసా చౌరస్తాలో ప్రత్యర్థి కుటుంబానికి చెందిన తల్వార్లతో ఇద్దరినీ అతికిరాతంగా నరికి చంపి వారి ఇంటికి వెళ్లి కుటుంబంలోని మరో ముగ్గురిని సైతం తర్వాలతో నరికి చంపిన కేసులో జిల్లా న్యాయమూర్తి నిందితుడైన మాజిద్‌ ఖాన్‌ కు జీవిత ఖైదీ తో పాటు 25 వేల రూపాయల జరిమానా విధించినట్లు తెల్పినారు.ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఒకరికి జీవిత ఖైదు పడినట్లు ఎస్పీ గారు వివరించారు.

ఈ సందర్భంగా ఎస్పీ గారు కేసులో నిందితుడికి శిక్ష పడేందుకు కృషిచేసిన సిబ్బందితోపాటు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రమణారెడ్డి గారిని సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు భైంసా ఏఎస్పి కిరణ్‌ ఖరే, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎం.రమణారెడ్డి,భైంసా పట్టాణ సిఐ ప్రవీణ్‌ కుమార్‌,లైసెన్‌ అధికారి సక్రియ నాయక్‌, అసిస్టెంట్‌ లెసన్‌ అధికారి శంకర్‌ లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking