బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య
జూన్ 27 (;“పార్లమెంట్ అసెంబ్లీ స్థానాల పునర్విభజన పైన కేంద్ర ప్రభుత్వం కుట్ర ” అనే అంశంపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీ ఆర్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కేంద్ర | ప్రభుత్వం బీసీలకు ఉపయోగ పడే కులగణన చేయకుండా పునర్విభజన పేరుతో విభ జించు, పాలించు అనే విధంగా కుట్రలు అనం తరం ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల పునర్విభజన పేరుతో మోదీ ప్రభుత్వం కపట నాటకాలాడుతున్నదని ఆరోపించారు.కేంద్రం పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి అసెంబ్లీ, చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిం చాలని డిమాండ్ చేశారు. బీసీలకు రాజ్యాంగపర మైన హక్కులను కల్పించకుండా మోదీ ప్రభుత్వం అణిచివేస్తున్నాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశం లో తెలంగాణ అధ్యక్షులుఎర్ర సత్యం, రాష్ట్ర ఉపాధ్యక్షులు చౌటుపల్లి సురేష్ , కార్యదర్శి సుధాకర్, విద్యార్థి నాయకులు రామకృష్ణ , జల్లేపల్లి కిరణ్ యువజన నాయకులు నివాస్, పృద్వి , కృష్ణ తదితరులు పాల్గొన్నారు..