హైదరాబాద్ జూన్ 27 ( ) :బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మీడియా కోఆ ర్డినేటర్ గా జిల్లేపల్లి కిరణ్ నియమితులైనారు. ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు ఆర్.కృష్ణయ్య నియామక పత్రాన్ని అందజేశారు. ఆర్.కృష్ణయ్య గతం లో ఎన్నికల్లో పోతిచేసిన సందర్బాలలో, మీడియా పరంగా ఆయన పడ్డ శ్రమ, చేసిన కృషిని గుర్తించిన ఆర్.కృష్ణయ్య బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మీడియా కోఆ ర్డినేటర్ గా నిమమిస్తు నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం జిల్లేపల్లి కిరణ్ మాట్లాడుతూ ఇక ముందు బీసీ సంక్షేమ సంఘం, తరపున రాష్ట్రము లో ఏలాంటి కార్యకరమాలు జరిగిగిన మీడియా పరంగా ముందుంది తన భాద్యతలను నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. తనపై గల నమ్మకం తో తనకు ఈ పదవిని ఇచ్చిన ఆర్, కృష్ణయ్య కు , అందుకు సహకరించిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం , రాష్ట్ర అద్యక్షులు యెర్ర సత్యం లకు కృతఙ్ఞతలు తెలిపారు.