మోదీ పాలనలో తగ్గిన దేశ అభివృద్ధి
మానసికంగా 30 ఏళ్ళు వెనక్కి
గిరిజన సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక్ తిరుపతి
ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ డిసెంబర్ 05 : మాటల గారడితో కేంద్రంలోని బీజేపీ సర్కార్ దేశ ప్రజలను మోసం చేస్తుందని,దేశ అభివృద్ధి లేకుండా పాలన చేస్తున్నారని,కులాలు, మతాల మధ్య ఘర్షణలు సృష్టించడంతో దేశ ప్రజల మానసికంగా 30 ఏళ్ళు వెనక్కి వెళ్లారని,సంక్షేమ రంగాలను పూర్తిగా విష్మరించందని గిరిజన సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ చైర్మన్ కోట్నాక తిరుపతి పేర్కొన్నారు.గురువారం మోడీ మోసం దేశం ఆగం పేరుతో కాంగ్రెస్ శ్రేణులు మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసనకు చేసిన అనంతరం రాస్తారొఖో నిర్వహించారు.బారీగా ట్రాపిక్ జాం కావడంతో పోలీసులు నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ…గత 11 సంవత్సరాల కాలంలో బీజేపీ దేశ ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు నెరవేర్చక పోగా, కార్పోరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ,దేశాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని, బీజేపీ నాయకులకు, ప్రభుత్వానికి ప్రజల అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. బీజేపీ,బీఆర్ఎస్ లు లొపాయికారి ఒప్పందం చేసుకుని, అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధిపై చర్చకు సిద్దామా అంటూ బీజేపీ నాయకులకు సవాలు విసిరారు. రానున్న రోజుల్లో అభివృద్ధికి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు ఎలాంటి నిరసనచేసిన కౌంటర్ ఇస్తామని హెచ్చరించారు. సాద్యమైతే అభివృద్ధిలో పాలు పంచుకోవాలే తప్ప అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకోబోమంటూ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ జిల్లా అధ్యక్షుడు అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి,మండల అధ్యక్షులు పింగిళి రమేష్,మున్సిపల్ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్, తుమ్మల నరేష్,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్లా నాగభూషణం,జిల్లా ఉపాధ్యక్షులు పూర్ణ చెందర్ రావు,మాజీ ఎంపీపీ గడ్డం శ్రీనివాస్,ఆకుల రాజేంధర్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమేల రాజు, శీధర్ల తిరుపతి,మాజీ ఎంపీటీసీలు,సందెల సురేష్,కందుల మోహన్, ముత్యాల శ్రీనివాస్,తోట మోహన్,వనపర్తి రవి,సీనియర్ నాయకుడు అంకతి శ్రీనివాస్,సర్దార్ రంజీత్,సింగ్,నరేందుల సత్తీష్,యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు రాందేని చిన్న వెంకటేష్,మండల అధ్యక్షుడు బొప్పు సుమన్ సర్పంచ్ లు,కౌన్సిలర్ లు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.