ప్రజాబలం లక్షెట్టిపేట మండల రిపోర్టర్ డిసెంబర్ 05 : లక్షెట్టిపేట మండలంలోని లక్షింపూర్ స్టేజి సమీపంలో బుధవారం రాత్రి 10: 00 గంటలకు కోల్ల వ్యాన్ ఢీకొని నంబాల గ్రామానికి చెందిన రాళ్లబండి సురేందర్ (33) సంవత్సరాల వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడని గురువారం ఎస్సై తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మృతుడు తన బైక్ పై మంచిర్యాలలో ఉండే తన అక్క వద్దకు వెళ్తుండగా ఎదురుగా మంచిర్యాల నుండి లక్షెట్టిపేట వైపు వస్తున్న కోల్ల వ్యాన్ ఢీ కొట్టగా మెడపై రక్తపు గాయమై,చేతులు, కాలు విరిగి అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. మృతుని తమ్ముడు సుదాకర్ పిర్యాదు మేరకు లక్షెట్టిపేట ఎస్సై-2 రామయ్య ప్రమాదానికి కారణమైన వాహనాన్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.