ప్రజాబలం దండేపల్లి మండల రిపోర్టర్ డిసెంబర్ 05 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని నాగ సముద్రం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గూడ రాజశేఖర్ విజయ దంపతుల కూతురు సహస్ర కూతురి పెళ్లికి మంచిర్యాల శాసన సభ్యుడు కొక్కిరల ప్రేమ్ సాగర్ రావు 10,000/- రూపాయల ఆర్థిక సహాయం అందచేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నిరుపేద కుటుంబం కావడంతో వీరికి మంచి మనసుతో మంచిర్యాల శాసన సభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కార్యకర్తకు అండగా నిలిచి ఈ ఆర్థిక సాయం సహాయం అందజేశారు.ఈ నగదును రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిరికొండ నవీన్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు లక్కాకుల సృజన్,మాజీ ఎంపీటీసీ కొంగల నవీన్,నాగ సముద్రం మాజీ సర్పంచ్ అన్నవెని ప్రేమల తిరుపతి, ఉప సర్పంచ్ దేవ లక్ష్మణ్,యూత్ కాంగ్రెస్ నాయకులు ఆకుల దుర్గాప్రసాద్,మంతెన రాజేందర్ రావు, తదితరులు కలిసి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందచేశారు.