యువత క్రీడల్లో రాణించాలి
మాజీ సైనికుడు సంతోష్ రెడ్డి
ప్రజాబలం ప్రతినిధి ఉప్పల్ డిసెంబర్ 5:నావికాదళ దినోత్సవం సందర్భంగా నాచారంలో మాజీ సైనికుడు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలను నిర్వహించారు. కబడ్డీ పోటీలలో నాచారంలోని పలు పాఠశాలలు పాల్గొన్నాయి. రెండు రోజులపాటు నిర్వహించిన కబడ్డీ పోటీల్లో గెలిచిన జట్లకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా సంతోష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని అన్నారు. యువత ప్రస్తుతం డ్రగ్స్ కు బానిస అవుతున్నారని దాని నుంచి బయటపడడానికి క్రీడల వైపు మొగ్గు చూపాలన్నారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. విద్యార్థులు మొబైల్ ఫోన్ గేమ్ లకు అలవాటు పడకుండా గ్రౌండ్ క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నావికా దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పోటీలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమాకాంత్ లోకే, వీరేంద్ర, శ్యామ్, కృష్ణ కిషోర్ రెడ్డి, మధు ముది, గురు, విజయకుమార్ సింగ్, ఐ సంతోష్, సాయి చంద్, శ్రీధర్, సురేందర్, శివ, స్నేహిత్ రెడ్డి, ప్రశాంత్, ఆలేటి శ్రీకాంత్, రాజు, వివాన్ ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.