గండీపేట మండలం ప్రజా బలం ప్రతినిధి 5 డిసెంబర్ 2024
మణికొండ మున్సిపల్ పరిధిలోని అయ్యప్ప భక్త బృందం రాజేందర్ గురు స్వామి ఆద్వర్యంలో స్వామివారి మండల దీక్షను సంపూర్ణం గావించి మణికొండ ఊరులో గల ఆంజనేయ స్వామి దేవాలయ సన్నిధిలో ఐక్యతకు మారు పేరుగా భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి భజన స్తోత్రాలతో కూడిన ఇరుముడి కార్యక్రమం జరుపుకొని తదుపరి మర్రిచెట్టు కూడలి బస్ స్టాప్ వెనక గల అయ్యప్ప స్వామి సన్నిధిలో అన్న ప్రసాదo గావించిన పిదప ఇతొచ్చిత దక్షిణతో కూడిన పులహరాలతో మండల (నలభై) మంది ఇరుముడి ధారణ గావించిన అయ్యప్ప స్వాములను ఘనంగా సత్కరించి వారి ఆశీర్వాదములు గైకొని వీడ్కోలు పలికిన అందె లక్ష్మణ్ రావు మరియు ఆలస్యం నవీన్ కుమార్, మాల్యాద్రి నాయుడు, షేక్ ఆరిఫ్, బాలాజీ, భరత్ రెడ్డి తది తరులు.