హిరో అల్లు అర్జున్ రావడంతో సంధ్య70ఎంఎం లో తొక్కిసలాట
హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి:దిల్ సుఖ్ నగర్ కు చెందిన రేవతి (39) తన భర్త భాస్కర్ , ఇద్దరు పిల్లలు శ్రీ తేజ్ (9) , సన్వీక (7) కలిసి పుష్ప ప్రీమియర్ షో చూడటానికి ఆర్టీసీ రోడ్స్ లోని సంధ్య 70 ఎంఎంకు వెళ్ళారు.
అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వచ్చిన సమయంలో అభిమానులు ఒక్కసారిగా థియేటర్ గేటు లోపలికి చొచ్చుకు వెళ్ళారు.
ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి, ఆమె కొడుకు శ్రీ తేజ లు అపస్మారక స్థితిలోకి వెళ్లారు.
వెంటనే పోలీసులు విద్యానగర్ లోని దుర్గ భాయి దేశముఖ్ హాస్పిటల్ కు తరలించారు.
రేవతి అప్పటికే మృతి చెందగా, శ్రీ తేజ పరిస్థితి విషమంగా ఉండటంతో బాలుడిని బేగంపేట కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు.
రేవతి మృతదేహాన్ని దుర్గాబాయి దేశముఖ్ హాస్పిటల్ నుండి గాంధీ మార్చురీకి తరలించారు.
ఇలా ఎందుకు జరిగింది?. ఇరుకు ఇరుకు థియేటర్లు, ప్రేక్షకుల రద్దీ ఉన్నప్పుడు సినిమా హీరోలు రావడం. అభిమానుల ఉద్రేకాలు పెల్లుబికడం. పిల్లల, ఫ్యామిలీలతో తొలి రోజు సినిమాలకు వెళ్ళడం. వంటి కారణాలు ఇలాంటి సంఘటనలకు దారితీస్తున్నాయి.
ఈ సంఘటనకు టికెట్ రేట్లు ఎక్కువ పెంచి ఎక్కువ షోలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా .
చిన్న సినిమా థియేటర్ అయిన సంధ్య70ఎంఎం కు విచ్ఛేసిన హిరో అల్లు అర్జున్ బాధ్యత వహిస్తాడా సంధ్య థియేటర్ యాజమాన్యం బాధ్యత వహిస్తుందా ఇలాంటి పెద్ద సినిమాలకు హిరోలు వచ్చేటపుడు సంబంధిత పోలీస్ అధికారులకు సూచన చేస్తారా అనుమతి తీసుకుంటారా ఈ సంఘటనకు పోలీసులది భాధ్యతన. ఏదిఏమయినా అక్క డ జరిగిన లాఠీఛార్జ్‌కు బలి అయిన అభిమానులకు ప్రాణం పోయిన మహిళకు బాధ్యత ఎవరిది.ఈ సంఘటనను హైకోర్టు సుమోటాగా కేసు నమోదు చేయాలి అని ప్రజలు అంటున్నారు.సంధ్య 70ఎంఎం పై కేసు నమోదు చేసిన పోలీసులు