జైలులోని నిరుపేద నిందితులకు బెయిల్ నిమిత్తం కేంద్రం ఆర్థిక సహాయం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి నవంబర్ 29 : జైలులోని నిరుపేద నిందితులకు బెయిల్ నిమిత్తం కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శుక్రవారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో నిర్వహించిన సమావేశంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ కమ్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి అర్పిత మారంరెడ్డి,లక్షెట్టిపేట సబ్ జైల్ జైలర్ తేజావత్ స్వామి, డి.సి.పి.భాస్కర్ లతో నిరుపేద నిందితుల అంశంపై సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ఆర్థిక స్థోమత లేని పూర్ అండర్ ట్రైల్ ప్రిసనర్స్ కొరకు బెయిల్ నిమిత్తం కేంద్రం 40 వేల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందిస్తుందని,నేరం రుజువు కాకుండా అకారణంగా వ్యక్తులను జైలులో ఉంచడం జరుగదని, జిల్లాలో నేరం రుజువు కాబడి శిక్ష అనుభవిస్తున్న వారు లేరని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి పి.రాజేశ్వర్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking