ఐటిడిఏ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్

 

ఖమ్మం ప్రతినిధి జులై 24 (ప్రజాబలం) ఖమ్మం
ఐటీడీఏ భద్రాచలం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలోని (29) ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో, ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ నందు (29) ఏఎన్ఎం పోస్టుల కొరకు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పని చేయడానికి ఎంపిక ప్రక్రియలో భాగంగా (40) ఎస్టి అభ్యర్ధుల యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ జిల్లా స్థాయి ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో గిరిజన భవన్ ఖమ్మం లో జరిగింది. డిప్యూటీ డైరెక్టర్ (ట్రైబల్ వెల్ఫేర్) జిల్లా వైద్య అధికారి ఖమ్మం జిల్లా ఉపాది కల్పన అధికారి ఖమ్మం ప్రిన్సిపాల్ ప్రభుత్వ ఏఎన్ఎం పాఠశాల ఖమ్మం మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking