జోరు వర్షంను సైతం లెక్కచేయకుండా కార్యకర్తల కష్ట సుఖాలు తెలుసుకుంటున్న టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు
ఖమ్మం ప్రతినిధి జులై 24 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల చెరువుమాధారం గ్రామంలో అనారోగ్యంతో మరణించిన ఆకుల నాగేంద్రరావు భౌతిక దేహానికి నివాళులు అర్పించి అనంతరం ముజ్జుగూడెం గ్రామాంలో అనారోగ్యంతో బాధపడుతున్న షేక్.సులేమాన్ కుటుంబాన్ని పరామర్శించారు,అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుగ్గిళ్ళ స్వామి ని పరామర్శించారు.జోరున వర్షం కురుస్తున్నప్పటికీ దానిని లెక్కచేయకుండా తడుస్తూనే చిరునవ్వు తో కార్యకర్తలును పలకరిస్తూ ముందుకు సాగారు.కాంగ్రెస్ కార్యకర్తలకు ఏ సమస్య ఉన్న తన దృష్టి కి తీసుకొస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానని రాయల పేర్కొన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుడు లాగా పని చేసి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడానికి తోడ్పాటును అందించాలని రాయల నాగేశ్వరరావు కోరారు.ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ సేవాదళ్ కన్వీనర్ బచ్చలికూరి నాగరాజు ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజని ఈవూరి శ్రీనివాస రెడ్డి ఆకుల శేఖర్ ఉన్నం వెంకటేశ్వరరావు షేక్ యాకుబ్, యువజన కాంగ్రెస్ నాయకులు యడవల్లి నాగరాజు నరేష్ తదితరులు పాల్గొన్నారు