తెలంగాణ పోరాట తొలి మహిళా ఉద్యమ స్ఫూర్తి చాకలి ఐలమ్మ

 

ఇల్లందు ప్రతినిధి సెప్టెంబర్ 26 (ప్రజాబలం) నాటి తెలంగాణ లో రజాకార్లు, జమీందారులు చేస్తున్న అరాచకాలు ఆగడాలు చూసి సహించలేక వెట్టి చాకిరి నిర్మూలన కోసం, భూ పోరాటాలు నిర్వహించి దొరల గడీలు బద్దలు కొట్టి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రత్యేక చరిత్ర కలిగిన చిట్యాల ఐలమ్మ తెలంగాణ మహిళల ఉద్యమస్ఫూర్తి అని డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్ కొనియాడారు కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా పలువురు వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ 1940 -47 మధ్యకాలంలో భారత కమ్యూనిస్టు పార్టీలో చేరి నాటి నైజాం నవాబుకు వ్యతిరేకంగా, వారికి సహకరించే జమీందారు, విసునూరు దేశముఖ్ రామచంద్రారెడ్డి లాంటి దొరలకు వ్యతిరేకంగా తొలి భూ పోరాటాలు నిర్వహించి న వీర వనిత చాకలి ఐలమ్మ ను ఆదర్శంగా తీసుకుని ప్రతి మహిళ చైతన్యం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి ప్రవీణ్ నాయక్, బానోతు నరసింహ నాయక్, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎస్ కె పతే మహమ్మద్, ఎల్ హెచ్ పి ఎస్ మండల అధ్యక్షులు భూక్య నాగేంద్రబాబు, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పాడిబండ్ల ప్రసాద్ శీలం పుల్లయ్య , అంగోత్ మోహన్ బానోతు చింటూ, బద్దల శేఖర్ చల్ల నాగేశ్వరరావు చింతల వెంకయ్య పగిడిపల్లి రాములు, అంబడిపూడి సత్యం, గుండ్ల చిరంజీవి రాయల నాగ శంకర్, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking