నివాళులు అర్పించిన
నిర్మల్ డిసిసి అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు,మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..భూమి కోసం,భుక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ వీరవనిత చిట్యాల చాకలి ఐలమ్మ గారి 129 వ జయంతి వేడుకలను పురపాలక సంఘం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు.నిర్మల్
జిల్లా కేంద్రంలోని పురపాలక సంఘం కార్యాలయము ఎదురుగా మరియు మయూరి హోటల్ ముందర ఉన్న చాకలి ఐలమ్మ గారి విగ్రహానికి రజక సంఘ సభ్యులతో కలిసి నిర్మల్ డిసిసి అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు,మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ గార్లు,పూలమాలలు వేసి,నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ
నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం, నేటి తరానికి స్ఫూర్తి అని,అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కోఠి విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టి,ఐలమ్మ మనుమరాలు శ్వేత గారిని మహిళ కమిషన్ సభ్యురాలిగా నియమించటం సంతోషంకారం,
గౌరవప్రదామని,అన్నారు.
ఈ కార్యక్రమంలో.
కమిషనర్ సి.వి.ఎన్ రాజు,
కౌన్సిల్ సభ్యులు,సంఘ సభ్యులు,తదితరులు ఉన్నారు