సింగిల్స్ డబుల్స్ సెమీఫైనల్ పోటీలు ఉత్కంఠభరితంగా కొనసాగాయి
ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 27 (ప్రజాబలం)ఖమ్మం లో జరుగుతున్న చల్లపల్లి రాధమ్మ మెమోరియల్ నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్ చివరి ఘట్టంకు చేరింది గురువారం నాడు జరిగిన అథర్వ శర్మ (మహారాష్ట్ర) మరియు ఓగెస్ థేజో జయ ప్రకాష్ (తమిళనాడు) తమ సెమీఫైనల్ విజయాలతో పురుషుల సింగిల్స్ ఫైనల్‌కి అర్హత సాధించారు. డబుల్స్ విభాగంలో కూడా హోరాహోరీ పోరు జరిగింది, ఇందులో తీర్థ శశాంక్ మాచర్ల (తెలంగాణ) మరియు అథర్వ శర్మ (మహారాష్ట్ర) జంట, వంశ్ బిష్ట్ (దిల్లీ) దేబాసిస్ సాహూ (ఒడిశా) జంట ఫైనల్‌కి అర్హత సాధించాయి వంశ్ బిష్ట్ (దిల్లీ) మరియు దేబాసిస్ సాహూ (ఒడిశా) జంట ఓగెస్ థేజో జయ ప్రకాష్ (తమిళనాడు) ఉడిత్ కంబోజ్ (హర్యానా) జంటపై 3-6, 7-6(4), [11-9] తేడాతో ఘన విజయం సాధించింది మొదటి సెట్ కోల్పోయినప్పటికీ రెండో సెట్లో బలమైన పుంజుకుని, చివరి మ్యాచ్ టైబ్రేక్‌లో నెగ్గారు తీర్థ శశాంక్ మాచర్ల (తెలంగాణ) మరియుఅథర్వ శర్మ (మహారాష్ట్ర) జంట ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఆదిత్య వర్ధన్ దుడ్డపూడి మరియు నైషిక్ రెడ్డి గనగామ (తెలంగాణ) జంటను 6-4, 6-1తో ఓడించారు తెలంగాణా మహారాష్ట్ర కాంబినేషన్ బలంగా ఆడుతూ ఫైనల్‌లో కూడా అసాధారణ ఆటతీరు కనబరుస్తారని నిర్వాహకులుతెలిపారు
