పోలింగ్ కేంద్రం సందర్శిన కమిషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్
ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ ఫిబ్రవరి 27 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలో గురువారం నిర్వహిస్తున్న ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.
రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జోన్ పరిధిలోని రామగుండం లోని ZPHS స్కూల్, గోదావరిఖని లోని సేక్రెడ్ హార్ట్ స్కూల్ మంచిర్యాల జోన్ పరిధిలో లక్షేట్టిపేట లోని ZPHS స్కూల్ పోలింగ్ కేంద్రాలను రామగుండం పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ క్షేత్ర స్థాయిలో పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎన్నికలు జరుగుతున్న తీరును పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సిబ్బందికి సూచించారు.పోలింగ్ కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్ అమలు చేయడం జరుగుతుందన్నారు. కమీషనరేట్ వ్యాప్తంగా ప్రశాంతంగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఏసీపీలు, సీఐలు,ఎస్సైలు,సిబ్బంది మొత్తం 560 మందితొ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.సమస్యాత్మక ప్రాంతాలలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు,భద్రతా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి అయి రిసెప్షన్ సెంటర్ చేరేవరకు పటిష్ట భద్రత రోడ్డు బందోబస్తు చేయడం జరిగిందని తెలిపారు. అయన వెంట అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, గొదావరిఖని ఏసీపీ రమేష్, గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి, ఆర్ఐ సంపత్, రామగుండం ఎస్ఐ సంధ్య రాణి, లక్షేట్టి పేట్ ఎస్ఐ సతీష్,సిబ్బంది ఉన్నారు.