జర్నలిస్టుల సమస్యపై చలో కరీంనగర్

డిజెఫ్ మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు కుశనపెల్లి సతీష్

ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ జనవరి 02 : డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మహాసభను ఈనెల 10న కరీంనగర్ పట్టణంలో నిర్వహిస్తున్న నేపథ్యంలో మహాసభను విజయవంతం చేయాలని డిజెఫ్ మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు కుశనపెల్లి సతీష్ కోరారు. గురువారం పట్టణంలోని విశ్రాంతి భవన ఆవరణలో మహాసభల పోస్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా లక్షెట్టిపేట మండల అధ్యక్షులు రాంపల్లి మధుచారి మాట్లాడుతూ… విలేకరుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసే సంఘాన్ని ఆదరించాలన్నారు. ఈ మహాసభను విజయవంతం చేయాలన్నారు. ఈ సభకు జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు మోట పలుకుల వెంకట్ తదితరులు హాజరువుతున్నారని, కరీంనగర్లో జరుగే మహాసభను విజయవంతం చేయాలని వారు కోరారు. మంచిర్యాల జిల్లా జర్నలిస్ట్ సోదరులందరికీ ఆహ్వానిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ లు సందీప్ యాదవ్, భానుచందర్, తిరుపతి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking