రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 15 ఏప్రిల్ 2025
భారత (తెలంగాణ) రాష్ట్ర సమితి పార్టీ 24 వసంతాలు పూర్తి చేసుకొని 25 వ సంవత్సరములో అడుగు పెడుతున్న శుభ సందర్భముగా పార్టీ ఆవిర్భావ రజతోత్సవ సంబరాల దినోత్సవం జరుపుకునే విషయమై రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం రాజేంద్రనగర్ పార్టీ ఇన్చార్జి రాష్ట్ర యువ నాయకుడు కార్తీక్ రెడ్డి నిర్దేశం మేరకు మంగళవారం రోజున చలో వరంగల్లు పేరిట కార్యకర్తల సన్నాహక సమావేశం జరుపు కోవడం జరిగినది. ఇట్టి సమావేశంలో కార్యకర్తలకు కార్తీక్ రెడ్డి దశా దిశా నిర్దేశించడం జరిగిన దరిమిలా పార్టీ మణికొండ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ మరియు స్థానిక నాయకులు అందరూ కలసి ఏకగ్రీవ తీర్మన్హముగా 27 ఏప్రిల్ రోజున ఉదయమే నెక్నంపూర్ కూడలిలో అలాగే పుపాలగూడ ఎల్.ఐ.సి కాలనీ కూడలిలో మరియు మణికొండ పరిధిలోని పాత ఆంధ్ర బ్యాంకు కూడలిలో, మర్రిచెట్టు కూడలిలో మొత్తంగా 4 చోట్ల పెద్ద ఎత్తున పార్టీ జండా కార్యక్రమం జరుపు కోని తదనంతరం ఉద్యమాల పురిటిగడ్డ ఓరుగల్లుగడ్డ కు పయనమై హనుమకొండ సమీపంలోని ఎలకతూర్తి గ్రామ కూడలిలో జరుగు పార్టీ ఆవిర్భావ రజతోత్సవ ఉత్సవాలకు మణికొండ నుండి ప్రైవేట్ బస్సులలో పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, ప్రతీ ఒక్క గులాబీదళ సైనికుడు కలసి కట్టుగా పెద్ద సంఖ్యలో కదం కదం తొక్కితూ తరలి వెళ్ళడానికి కృత నిక్షయంతో ఉన్నామని సీతారాం ధూళిపాళ తెలిపినాడు.
