40 వసంతాలుగా అధ్యక్షులు సామల బాబు సేవలందించడం అభినందనీయం
చార్ట్ సంస్థ 30 వసంతాల వేడుకలో డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, ప్రముఖ డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు
ఇల్లందు ప్రతినిధి (ప్రజాబలం) ఇల్లందు నియోజకవర్గం కామేపల్లి సెప్టెంబర్ 29
సామాజిక సేవలో చార్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ ది ప్రత్యేక స్థానమని డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్, ప్రముఖ వైద్యులు, ఖమ్మం శ్రీరక్ష హాస్పిట ల్ అధినేత డాక్టర్ జి.వెంకటేశ్వర్లు, ప్రము ఖ సామాజికవేత్త, జాతీయ ఉత్తమ అవా ర్డు గ్రహీత చిలుముల రమేష్ అన్నారు. కామేపల్లి మండలం రామకృష్ణాపురం పంచాయతీ పరిధిలోని హరిచంద్రపురం గ్రామంలోని చార్డ్ సంస్థ కార్యాలయంలో చార్డ్ సంస్థ 30 వసంతాల వేడుకను ఆ సంస్థ అధ్యక్షులు సామల బాబు ఆధ్వ ర్యంలో ఆదివారం పండుగ వాతావరణం లో ఘనంగా నిర్వహించారు.వేడుకను పురస్కరించుకొని సంఘ పతాకాన్ని ఆవి ష్కరించారు.జాతీయనేతలకు ,మాతృమూర్తి విగ్రహానికి పూలమాలలు వేసి వేడుకలను ప్రారంభించారు.30 వసంతా ల వేడుక విశిష్టతను ఈ సందర్భంగా అధ్యక్షులు సామల బాబు, ఉపాధ్యక్షులు జి.రామనాథం,కార్యదర్శి పుచ్ఛా ప్రభాకర్ వివరించారు.సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిం చిన సామాజిక సేవా కార్యక్రమాల ప్రగతి నివేదికను వివరించారు.అందుకు సం బంధించిన ప్రత్యేక బుక్ లెట్ ను ఆవిష్క రించారు.అనంతరం జరిగిన సభలో డిసి సిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, డాక్టర్ జి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ స మాజంలో చేసే సేవను బట్టే తగిన గుర్తిం పు లభిస్తుంది అన్నారు. సామాజిక సేవ దృక్పథాన్ని ప్రతి ఒక్కరు అలవర్చుకొని సమాజ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కోరారు.సంస్థ అధ్యక్షులు సామల బాబు 40 వసంతాలు సామాజిక సేవారంగంలో పూర్తి చేయడం, చార్డ్ సంస్థ ను స్థాపించి 30 వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవటం ప్రశంసనీయమన్నారు. ఆ సంస్థ సేవలను అభినందించారు. సభ అనంతరం సామల బాబు – హైమావతి దంపతులను శాలువా కప్పి పూలమాల లతో ఘనంగా సత్కరించి వారి సేవలను కొనియాడారు.అదే విధంగా ముఖ్య అతి థులుగా హాజరైన మేకల మల్లి బాబు యాదవ్, డాక్టర్ జి వి, ప్రముఖ సామాజి కవేత్త చిలుములరమేష్ ను చార్డ్ సంస్థ ప్రతినిధి బృందం శాలువా కప్పి సత్కరిం చి వారి సేవలను కొనియాడటం జరిగిం ది.జ్ఞాపికలు కూడా అందజేశారు.పండుగ వాతావరణంలో నిర్వహించిన ఈ 30 వ సంతాల వేడుక కార్యక్రమంలో కృష్ణారా వు, నరసింహారావు, చిన్నప్ప, శంకర్, నవీ న్, గుగులోత్ రాందాస్, అజ్మీర లక్ష్మణ్, లాలు, రాజేష్, జరపల దశరథ్, ఎల్ హెచ్ పి ఎస్ మండల అధ్యక్షులు భూక్య నాగేంద్రబాబు నాయక్,బి.శేఖర్,సాయి, చార్డ్ సంస్థ కు చెందిన జర్పల రవీందర్, భీముడు, గ్రామస్తులు, లబ్ధిదారులు, రైతులు, గిరిజనులు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, సామాజిక సేవకులు తదితరులు పాల్గొన్నారు