ముఖ్యఅతిథిగా మేయర్ పూనుకొల్లు నిరజ
ఖమ్మం ప్రతినిధి (ప్రజాబలం) దసరా పండగ సందర్భంగా ఖమ్మం నగరంలో పెవిలియన్ గ్రౌండ్ మైదానంలో ఏర్పాటు చేసిన లేజర్ షో ఫెస్టివల్ ఎగ్జిబిషన్ ను నగర మేయర్ పూనుకొల్లు నిరజ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దసరా పండగ సందర్భంగా పిల్లలకు పెద్దలకు యువతకు అన్ని వయసుల వారికి ఆహ్లాదం కలిగించే విధంగా ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేయడం సంతోష్కరంగా ఉందన్నారు పట్టణ ప్రజలు సాయంకాలం వేల కుటుంబ సమేతంగా వచ్చి ఆనందంతో గడపాలని కోరారు ఈ సందర్భంగా నిర్వాకులు బాలశౌరి అప్పిరెడ్డి అచ్చయ్య లు మాట్లాడుతూ 45 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుందని తెలియజేశారు . ఈ ఎగ్జిబిషన్లో అద్భుతమైన లేజర్ ఏర్పాటు చేయబడిందని దీనితోపాటు ఎంటర్టైన్మెంట్ కోసం 80 ఫీట్ల జాయింట్ వీల్ , బెంగళూరు పాలిసే 100 అడుగుల ముఖద్వారం మేరీ కొలంబస్ బ్రేక్ డాన్స్ డ్రాగన్ ట్రైన్ క్రాస్ వింగ్ తో పాటు అనేక రకాల స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ కమర్తపు మురళి పాలెపు వెంకటరమణ బుడిగం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు