బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నేరెళ్ల శ్రీనివాసరావు
ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 30 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్ అడ్వకేట్ తిరుమలలో అధ్యక్షతన విమలక్క ఆధ్వర్యంలో ఖమ్మంలోని ఖానాపురం ప్రాంతంలో జరగబోవు బహుజన బతుకమ్మను జయ ప్రధాని కోరుతూ కరపత్ర ఆవిష్కరణ నిర్వహించడం జరిగినది . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నేరెళ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా పర్యావరణ పరిరక్షణ కొరకు రాష్ట్రవ్యాప్తంగా విమలక్క ఆధ్వర్యంలో జరుగు ఈ బహుజన బతకమ్మను ప్రతి ఆడబిడ్డ హాజరై జయప్రదం చేయవలసిన బాధ్యత ఉంది అన్నారు . అడ్వకేట్ ఉబ్బలపల్లి నిరోషా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి ఒకపక్క దొరసాని బతుకమ్మ నిర్వహిస్తుంటే తెలంగాణ బహుజన ఆడబిడ్డ బహుజన మహిళల స్థితిగతులు వివరిస్తూ గత 15 సంవత్సరాలుగా విమలక్క బహుజన బతకమ్మ నిర్వహించడం ఈ రాష్ట్రంలో ఒక విప్లవ ఆత్మక మార్పు కొనసాగుతుంది . బహుజన సంస్కృతిలో ప్రత్యామ్నాయంగా జరిగే ఈ బహుజన బతుకమ్మ ను జయప్రదం చేయాలని అన్నారు . అడ్వకేట్ తిరుమల్ రావు మాట్లాడుతు మహిళల పట్ల జరుగు అత్యాచారాల కారణాల వెనక సంవత్సరాల నుండి కొనసాగుతున్న బ్రాహ్మణీయ మనువాద ఆలోచనలేనని . పైవర్ణాల స్త్రీల కు ఒక న్యాయం కింది దళిత బహుజన స్త్రీలకు మరొక న్యాయం జరుగుతుందని అందుకే బహుజన స్త్రీలు ఐక్యం కావలసిన అవసరం ఉందని. రాజకీయ వాటాకై బహుజన స్త్రీలు ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో బహుజన పొలిటికల్ సెంటర్ రాష్ట్ర నాయకులు పోడకండి రాంబాబు , ముదిరాజ్ హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు లింగన్న బోయిన లక్ష్మణ్, ప్రముఖ న్యాయవాది అద్దంకి నాగేశ్వరరావు, ప్రముఖ అడ్వకేట్లు తదితరులు పాల్గొన్నారు