ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి సెప్టెంబర్ 30:
సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి (63) ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి మరియు జిల్లా రెవిన్యూ అధికారి జె ఎల్ బి హరిప్రియకి విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.
ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే స్పందిస్తూ వాటిని వెంట వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వినతులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ ఆన్లైన్ పోర్టల్ లో అప్లోడ్ చేయాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.