ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 30 ప్రజాబలం ఖమ్మం
ప్రజావాణిలో తమ సమస్యలు తెలుపుతూ ప్రజలు అందజేసిన దరఖాస్తులను పరిశీలించి, సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ లు డా. పి. శ్రీజ, డి. మధుసూదన్ నాయక్, డిఆర్డీవో సన్యాసయ్య, డిఆర్వోఓ ఎం. రాజేశ్వరి లతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను పరిష్కారానికి ఆదేశిస్తూ సంబంధిత అధికారులకు ఫార్వార్డ్ చేశారు తిరుమలాయపాలెం మండలం మేడిదపల్లి రెవెన్యూ గ్రామానికి చెందిన ముదిరెడ్డి నర్సిరెడ్డి ఎస్సారెస్పీ ఓల్డ్ కెనాల్ డిబిఎం 60.25 ఆర్ క్రింద 32 కుంటల భూమి కోల్పోయానని దానికి నష్టపరిహారం అందలేదని, ఆ భూమి రైతు బంధు డబ్బులు కూడా రాలేదని, నష్టపరిహారం, రైతుబంధు డబ్బులు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, భూ సేకరణ విభాగానికి రాస్తూ సమస్యను పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
కల్లూరు మండలం చండ్రుపట్ల గ్రామానికి చెందిన పి. నాగరాజు మార్చి 4న పంచాయతీ కార్యదర్శిగా పోస్ట్ ఇస్తామని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్ ధ్రువీకరణ చేశారని, ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వలేదని, ప్రస్తుతం కల్లూరు, తల్లాడ, సత్తుపల్లి, వి.ఎం. బంజర మండలాల్లో ఖాళీగా ఉన్న పోస్టుకు అవకాశం కల్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, కలెక్టరేట్ పరిపాలన అధికారికి రాస్తూ పరిశీలించి, ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ అన్నారు కామేపల్లి మండలం ముచ్చర్ల రెవెన్యూ సాతానిగూడెం గ్రామానికి చెందిన డి. మంగతాయమ్మ సర్వే నెంబర్ 520లో తన 9 గుంటల భూమిని వై. వెంకట నారాయణ ఆక్రమించారని, రెవెన్యూ రికార్డులు పరిశీలించి న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, తహసిల్దార్ కు రాస్తూ పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు ఖమ్మం నగరం శ్రీనగర్ కాలనీకి చెందిన కోట సుమ తాను బిఎస్సీ, పిజిడిసిఏ, ఇంగ్లీష్, తెలుగు లోయర్, హయ్యర్ టైపింగ్ విద్యార్హత కలిగి ఉన్నానని, తనకు చెవిటి, మూగ బ్యాక్ లాగ్ పోస్టులలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, జిల్లా ఉపాధి అధికారికి రాస్తూ పరిశీలించి అవకాశం మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు