చేగుంట వెలుగు

 

ఖేలొ ఇండయా అండర్ 14,అండర్ 18 రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలలో మెదక్ జిల్లాకు వెండి,కాంస్య పథకాలు

మెదక్ చేగుంట డిసెంబర్ 25 ప్రజాబలం న్యూస్ :-

23,24 వ తేదీలలో సికింద్రాబాద్ లోని ఆర్.ఆర్,సి గ్రౌండ్ సౌత్ సెంట్రల్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన రాష్ట్రస్థాయి ఖేలొ ఇండియా అండర్ 14, అండర్ 18 రగ్బీ పోటీలలో మెదక్ జిల్లా మూడో స్థానం సాధించి 30,000, 20,000 నగదు బహుమతి కైవసం చేసుకుందని కోచ్ కర్ణం గణేష్ రవికుమార్ తెలిపారు.అండర్ 14 బాలికల విభాగం నల్గొండతో జరిగిన ఫైనల్ పోటీలో హోరాహోరీ పోరాడి వెండి పథకం కైవసం చేసుకొని 30,000 చెక్ అందుకున్నారు,అండర్ 18 జూనియర్ బాలికల విభాగం లో హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో హోరాహోరీ పోరాడి 1-0 గోల్స్ తేడాతో గెలిచి కాంస్య పతకం కైవసం చేసుకొని 20,000 చెక్కు ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ రగ్బీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దోసపాటి రాము చేతుల మీదుగా తీసుకున్నారని కోచ్ తెలిపారు. ఈ పోటీలలో పాల్గొన్న అండర్ 14 క్రీడాకారినిలు గాయత్రి,లాస్య,దివ్య,కావ్య,రాణికుమారి,అక్షయ,వైష్ణవి,మాధురి,అక్షిత,అనురాధ,ప్రియాంక,నందిని.అండర్ 18 జూనియర్ విభాగంలో పాల్గొన్న మెదక్ జిల్లా క్రీడాకారినిలు శిరీష ,జ్యోతి, సుజాత, అనిత, పూజ,అంజలి, నిఖిత,కళ్యాణి, శైలజ, పింకీబాయ్, నికిత, సింధుజ ఉన్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నేషనల్ రగ్బీ రెఫరీలు కర్ణం మల్లీశ్వర్జ్,రితేష్,మహేష్ ,జిల్లా పి.ఈ.టి ల సంఘం అధ్యక్షుడు నాగరాజు,పిడి లు శారద, మంజుల,నర్సింలు,సంతోష్ పాల్గొన్నారు.మెదక్ జిల్లా బాలికలు కాంస్య పతకం సాధించడం పట్ల మెదక్ ట్రైబల్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ వాసంతి పిళ్ళై,చేగుంట మాడల్ కాలేజ్ ప్రిన్సిపల్ భూపాల్ రెడ్డి,పి.డి వెంకటేష్,టేక్మాల్ మాడల్ కాలేజ్ ప్రిన్సిపల్ కరుణాకర్ రెడ్డి,రెడ్డిపల్లిZPHS ప్రాధానోపాధ్యాయురాలు గంగుభాయ్ హర్షం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking