క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తుమ్మల నాగేశ్వర రావు

ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 25 (ప్రజాబలం) ఖమ్మం స్థానిక చర్చికాంపౌండ్ లోని సీఎస్ఐ చర్చిలో సోమవారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చి ఫాదర్, బిషప్ లు ఇద్దరు మంత్రులకు ఆశీర్వచనలను అందచేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, క్రీస్తు జన్మదినాన్ని ప్రపంచ, దేశవ్యాప్తంగా ఒక పండగ వాతావరణం లో జరుపుకునేది క్రిస్మస్ పండగ అని అన్నారు. క్రైస్తవ సోదరులకు ప్రత్యేకంగా క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు, అడ్వాన్స్ గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. యేసు క్రీస్తు చల్లని చూపు తెలంగాణ ప్రజలు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల మీద ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. ప్రభువు ఆశీస్సులతో ప్రజలకు మంచి పాలన ఇచ్చే విధంగా, ప్రభువు శక్తిని ఇవ్వాలని వారు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking