క్రీస్తును ఆరాధించటమే క్రిస్మస్ పండగ.

టేకులపల్లి క్రిస్మస్ వేడుకల్లో సండ్ర

ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 25 (ప్రజాబలం) ఖమ్మం ప్రేమ, శాంతి, ఐక్యతే క్రిస్మస్ పండగ సందేశం అని సండ్ర వెంకట వీరయ్య గారు అన్నారు. పెనుబల్లి మండలం, టేకులపల్లి గ్రామంలో క్రిస్టమస్ వేడుకల్లో సండ్ర వెంకట వీరయ్య గారు పాల్గొన్నారు. గ్రామంలోని చర్చను సందర్శించి మిఠాయిలు పంచి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి విచ్చేసిన సండ్ర వెంకట వీరయ్య గారిని గ్రామస్తులు మండల నాయకులు సాదర స్వాగతం పలికారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కనగాల వెంకట్రావు, జడ్పిటిసి చెక్కిలాల మోహన్ రావు, లక్కినేని వినీల్, నీలాద్రి ఆలయ చైర్మన్ పసుమర్తి వెంకటేశ్వరరావు, మండల పార్టీ కార్యదర్శిగా భూక్యా ప్రసాద్, కన్నయ్య, కోట ప్రభాకర్, కోట ప్రసాద్, పండు తదితులున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking