కొనరావుపేట ఏప్రిల్ -07 (ప్రజాబలం దినపత్రిక )
కొనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన బాదినేని శ్రీనివాస్ నిరుపేద కుటుంబానికి చెందిన వికలాంగుడు కావడంతో అతనికి అండగా నేనున్నానంటూ కోనరావుపేట మండల మాజీ జెడ్పిటిసి చిన్నమనేని శ్రీ కుమార్ నిలిచారు. వికలాంగుడైన శ్రీనివాస్ కి మూడు చక్రాల మోటర్ సైకిల్ ని అందజేశారు. ఈ సందర్భంగా చిన్నమనేని శ్రీ కుమార్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబీకుడైన శ్రీనివాస్ కి ఒక కుమారుడు అలాగే ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి ఇంకా కష్టపడుతూ హోటల్ నడిపించుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తున్నాడని వికలాంగుడైన అతను మనోధైర్యాన్ని కోల్పోకుండా పని చేసుకుంటున్నాడని ఈ విధంగా సహాయం చేయడం నా అదృష్టమని చిన్నమనేని కుటుంబానికి సుద్దాల గ్రామంతో నాకు పేగు బంధం ఉందని వారన్నారు. శ్రీనివాస్ కుటుంబానికి సహాయం చేసినందుకు గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులు యువకులు శ్రీ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు.