చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు

 

-పేదలకు దుప్పట్ల పంపిణీ

ప్రజాబలం మందమర్రి మండల రిపోర్టర్ నవంబర్ 30 :

చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట్ స్వామి పుట్టినరోజు వేడుకలను మందమర్రి పట్టణంలో ప్రధాన రహదారి కూడలి వద్ద కాంగ్రెస్ సీనియర్ నాయకుడు యాదవ మహాసభ అధ్యక్షుడు బండి సదానందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సదానందం మాట్లాడుతూ వివేక్ వెంకటస్వామి బడుగు బలహీన వర్గాల నాయకుడిగా పేదల పెన్నిధిగా,పేదల కోసం తపించే నాయకుడని అభివర్ణించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో అనేక పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఎంతో కృషి చేశారని చెప్పారు. చెన్నూరు నియోజకవర్గానికి 1000 కోట్ల నిధులు తీసుకువచ్చిన ఘనత ఎమ్మెల్యే వివేకదని అన్నారు. అధికారంలో ఉన్న లేకున్నా విశాఖ ట్రస్టు ద్వారా ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చారని కొనియాడారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మార్వో సతీష్, సి. ఐ శశిధర్ రెడ్డి, ఎస్.ఐ శివనీతి రాజశేఖర్ ల చేతుల మీదుగా దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నదానాన్ని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంద తిరుమలరెడ్డి, రాగడి రామ్ రెడ్డి, పెద్ది రాజన్న, ఎండి ఇబ్రహీం, మల్లెత్తుల నరేష్ యాదవ్, కొలుగూరి విజయ్ కుమార్, రామసాని సురేందర్, సుద్దాల రాజ్ కుమార్, ఎం.డి ఇసాక్, వేముల శ్రీనివాస్, తాడేపు వేణు, బాకం రవి, కాంగ్రెస్ యువ నాయకులు రాయబారపు కిరణ్, ఏం.డి జావిద్ ఖాన్, బియ్యని రవికిరణ్, నిర్మట్ల సుజిత్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking