మండలంలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు

 

ప్రజాబలం మందమర్రి మండల రిపోర్టర్ నవంబర్ 30 :

ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు ఆటపాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిన్చారు. మందమర్రి మండల పరిధిలోని సారంగ పల్లి, చిర్రకుంట, ఆడిల్ పేట గ్రామాలలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిపిఆర్ఓ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ లపై అవగాహన కల్పించారు.
రానున్న రోజులలో మరెన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. ఈనెల 19 తేదీ నుండి డిసెంబర్ 7 వరకు ప్రజా పాలన, ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాయాత్ర కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమాలలో సారధి కళాకారులు లావుడ్యా రమేష్ ( టీం లీడర్ )
మామిళ్ల లచ్చన్న, గొడిసెల కృష్ణ, సల్లూరి కృష్ణ, రామటెంకి రాజ తిరుపతి, కాసిపేట సంతోష్, వావిలాల నాగలక్ష్మి, స్థానిక మాజీ సర్పంచ్ లు, వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శి, ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking