చేవెళ్ల ప్రజా బలం ప్రతినిధి 01 ఏప్రిల్ 2024: చేవెళ్ల పార్లమెంటు బీ ఆర్ ఎస్ పార్టీ ఎన్నికల సన్నాహాక ప్రక్రియలో భాగంగా 01.04.2024 సోమవారం రోజున చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గ బీ.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ బీ.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మాజీ విద్యాశాఖ మంత్రివర్యులు మహేశ్వరం శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు, చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య మాట్లాడుతూ సుదీర్ఘ రాజకీయ అనుభవం, అన్ని వర్గాలకు ఆప్తుడు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన నాయకుడు, మాజీ జడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ, బీసీ ముద్దు బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ని బీ.ఆర్.ఎస్ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు.