100 రోజుల్లోనే నియోజకవర్గం అభివృద్ధి
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 01 : మౌళిక రంగానికి కాంగ్రెస్ సర్కార్ పెద్దపీట వేస్తుందని,100 రోజుల్లోనే నియోజకవర్గంను ఎంతో అభివృద్ధి చేశానని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పేర్కొన్నారు.సోమవారం అయన పట్టణంలోని 5.80 కోట్లతో నూతనంగా నిర్మించనున్న పాఠశాల, కాలేజీ పనులను స్థానిక నాయకులతో పరిశీలించారు. అనంతరం అయన మాట్లాడుతూ…ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కేవలం వంద రోజుల్లోనే భారీగా నిధులు మంజూరు చేయించానని తెలిపారు.పార్లమెంట్ ఎన్నికల కోడ్ రావడంతో మిగతా నిధులు నిలిచిపోయాయని అన్నారు. లక్షెట్టిపేటలో సాగునీరు, తాగునీరు,మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు వివరించారు. ముఖ్యంగా ప్రభుత్వ పాటశాలలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి కలెక్టర్, విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమావేశం సత్ఫలితాలు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని చెప్పారు. పాఠశాలలో తాగునీరు,మరిగుదొడ్ల నిర్మాణం ప్రహరిగొడ నిర్మాణం, విద్యుత్ సౌకర్యం ఏర్పాటుకు పెద్ద మొత్తంలో నిధులు తీసుకవస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఎండీ అరిఫ్,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్లా నాగభూషణం,కౌన్సిలర్ లు సురేష్ నాయక్,రందేని వెంకటేష్,కాప్షన్ మెంబెర్ సయ్యద్ షహీద్ అలీ, గడికొప్పుల కిరణ్,సుమన్ చక్రవర్తి, మండల అధ్యక్షుడు పింగళి రమేష్,బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు నలిమేల రాజు, మండల యూత్ అధ్యక్షుడు అంకతి శ్రీనివాస్,ఎండి అమీర్,రాజు,రాజేష్,శ్రీధర్, నవాబ్,చంద్రమౌళి,శ్రీకర్, పడల గౌతమ్,చిన్న రమేష్, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు,పార్టీ కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు
