ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..రిజర్వేషన్ల పితామహుడు ఛత్రపతి సాహు మహారాజ్ జయంతి వేడుకలను నిర్మల్ పట్టణ కేంద్రంలో బీఎస్పీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ
సందర్భంగా బిఎస్పీనిర్మల్ జిల్లా ఇంచార్జీ,అడ్వకేట్ జగన్ మోహన్ పూలమాలలు వేసి చత్రపతి సాహు మహారాజు గురించి మాట్లాడుతూ… చత్రపతి శివాజీ మహారాజ్ మనమడు చత్రపతి సాహూ మహారాజ్ “రిజర్వేషన్ ల” పితామహుడు అని 1894 నుంచి 1922 వరకు కొల్లాపూర్ సంస్థానాన్ని సంస్కరణలు చేసి పరిపాలించారని,1902 సం. లోనే కొల్లాపూర్ సంస్థానంలో 50 శాతం రిజర్వేషన్లు ప్రకటించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు.రిజర్వేషన్ల కొనసాగింపుగా బారతదేశ రాజ్యంగంలో డాక్టర్ అంబేద్కర్ గారు నిమ్న స్థాయి వర్గాలకు,మహిలలకు రిజర్వేషన్లు కల్పించారని అన్నారు.
ఉచిత నిర్బంధ విద్యా,బాల్యవివాహాల రద్దు,వితంతు వివాహాలు జరిపించి ప్రత్యేక చట్టం తెచ్చినారని,జోగిని దేవదాసి చట్టాన్ని రద్దు చేశారని, కులాంతర వివాహాలు,మతాంతర వివాహాలని ప్రోత్సహించి ఎన్నో సంస్కరణలు చేపట్టిన ఘనత చత్రపతి సాహుమహరాజ్ అనికొనియాడారు.
కొల్లాపూర్ సంస్థానంలో ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీలకు సమన్యాయం జరగాలని కలలు కన్నాలని,మహనీయులు సాహు మహరాజ్ ఆలోచనలు నేటి యువతకు ఆదర్శం అని జగన్ మోహన్ అన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా మహిళా కన్వీనర్ ఎస్కే.లక్ష్మీ యాదవ్,నిర్మల్ నియోజకవర్గం నాయకులు సఫియాన్ సలీం,రాజేశ్వర్,బుజ్జమ్మ, కోమలి,గీతలు పాల్గొన్నారు.