ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. తెలంగాణ రాష్ట్ర నిరుపేదల పెన్నిధి ముఖ్యమంత్రి కేసిఆర్ అని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు మంగళవారం నిర్మల్ మంత్రి క్యాపు కార్యాలయంలో వైద్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న ఎం.పి.హెఏ,యల్టీ,ఫార్మసీస్ట్ ఉద్యోగులను ప్రభుత్వం ఇటీవలే క్రమబద్ధీకరణ చేసిన సందర్భంగా వారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ని కలిసి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నిరుపేదల పెన్నిధి ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఇచ్చిన మాట తప్పని గొప్పవ్యక్తి అని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని తెలంగాణ ఉద్యమ సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మహోన్నత వ్యక్తి కేసిఆర్ అని అన్నారు మరోవైపు గతంలో ఏ ప్రభుత్వం కూడా చెయ్యలేని పనులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలకోసం 33 జిల్లాలో కోర్టు లను కూడా ఏర్పాటు చెయ్యడం జరిగింది గతంలో ఎక్కడో కేసు అవుతే ఇంకా సుమారు 100 కిలోమీటర్ల దూరంలో కోర్టులు ఉండేవని ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని ఏ జిల్లాకు ఆ కోర్టు ను మంజూరు చెయ్యడం జరిగిందని మరో వైపు మతాలకు అతీతంగా దేవాలయాలు అభివృద్ధి చెయ్యడం జరిగిందని అన్నారు.నిర్మల్ కు మెడికెల్ కాలేజీ వచ్చిందని నర్సింగ్ కాలేజ్ కూడా రాబోతుందని తెలిపారు.