జగిత్యాల ప్రతినిధి, మే 30:(ప్రజా బలం) యాదవ హక్కుల పోరాట సమితి యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షులుగా బత్తుల కొండయ్య యాదవ్ ను నియమిస్తూ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కొక్కెర మల్లేష్ యాదవ్ నియమించారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో జగిత్యాల జిల్లాలో యాదవ హక్కుల పోరాట సమితి విస్తరణలో భాగంగా యువజన విభాగ విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టామని మల్లేష్ యాదవ్ పేర్కొన్నారు. అందులో భాగంగా యువజన విభాగంలో జిల్లా ఉపాధ్యక్షులుగా కొండయ్య యాదవ్ ను నియమించామని యాదవ హక్కుల పోరాటం, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని మల్లేష్ యాదవ్ సూచించారు. తన నియామకానికి కృషిచేసిన ప్రతిఒక్కరికి కొండయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అద్యక్షుడు మేకల రాములు యాదవ్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొక్కు దేవేందర్ యాదవ్, జగిత్యాల జిల్లా అద్యక్షుడు బల్కం మలేష్ యాదవ్, వేములవాడ శ్రీనివాస్ యాదవ్, రాములు యాదవ్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు