ఉపాధ్యాయులకు హ్యాండ్ బుక్స్ ఏర్పాటు చెయాలి

 

తెలంగాణఆందోల్ ప్రజాబలం ప్రతినిధి. రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ బుక్స్ విద్యార్థులకు ఆయా పాఠశాలకు తరగతి వారి సంఖ్య ప్రకారం సరఫరా చేయడం జరుగుతుంది కానీ భోధించే ఉపాధ్యాయుల హ్యాండ్ బుక్స్ ఇవ్వడం లేదని పలు ఉపాధ్యాయు సంఘాల డిమాండ్ చేశారు.
(ఎం ఈ ఓ) లను అడిగితె వారు కూడా తరగతి సంఖ్య ప్రకారం మాత్రమే మాకు ఇస్తున్నారు కావున మీకు మేము టీచర్స్ హ్యాండ్ బుక్స్ ఇవ్వలేం అని చెప్పుడము శోచనీయం, మేము విద్యార్థుల వద్ద బుక్ తీసుకోని చెప్పడం జరుగుతుందని దీని వలన ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్నప్పుడు ఒక విద్యార్థి తన తోటి విద్యార్థి పుస్తకం చూడవలసి వస్తుంది. పాత పుస్తకం చూసి చెపుదాం అంటే ప్రతీ సారి సిలబస్లో కొన్ని మార్పులు చేస్తున్నారు అన్నారు.
కావున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ మరియు తెలంగాణ రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి ఈ అంశం పై దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తంచేశారు.
హ్యాండ్ బుక్ లేకుండానే పాఠ్యంశము ఎలా ప్రిపేర్ అవుతారు లెసన్ ప్లాన్ ఎలా రాస్తారు. కావున తమరు కనికరించి ప్రతీ బడికి అన్ని సబ్జెక్టుల టీచర్స్ హ్యాండ్ బుక్స్ సరఫరా చేయాలనీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ కూటమి రాష్ట్ర కన్వీనర్ దుద్యాల గంగాధర్ నర్సింహులు ప్రధాన డిమాండ్ చరసారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking