ముఖ్యమంత్రి కేసీఆర్  బీసీలకు పెద్దపీట

ముఖ్యమంత్రి కేసీఆర్  బీసీలకు పెద్దపీట వేసి ప్రాధాన్యం కల్పిస్తున్నారని, దీనికి నిదర్శనం ఎమ్మెల్సీ బండా ప్రకాష్ గారికి శాసనమండలి వైస్ చైర్మన్గా అవకాశం కల్పించడమే అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు

Chief Minister KCR is big for BCs

శాసనమండలి వైస్ చైర్మన్ గా బండా ప్రకాష్ గారి ప్రమాణస్వీకారం చేస్తున్న కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ హాజరై బండా ప్రకాష్ గారిని కలిసి పుష్ప గుచ్ఛం ఇచ్చి శాలువా కప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఐటీ, మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ , మండలి చైర్మన్ గుప్తా సుఖేందర్ రెడ్డి,ఎమ్మెల్సీ కవిత మర్యాదపూర్వకంగా కలిసిసారు, ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో అన్ని వర్గాలకు సమప్రాధాన్యం ఇస్తూ, సంక్షేమ పథకాలు, అభివృద్ధి ని జోడెద్దుల మాదిరిగా పరుగెత్తిస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ మరోపక్క బీఆర్ఎస్ స్థాపించి దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించనున్నారని తెలిపారు ఇలాంటి సామర్థ్యం ఉన్న నాయకులు చాలా అరుదని ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి సరైన వ్యక్తిని ఆయన తెలిపారు. త్వరలోనే దేశంలోనే బీఆర్ఎస్ రాజకీయ సంచలనం సృష్టిస్తుందని తెలిపారు. ఈ దిశగా ముందుకు వెళ్ళేలా ప్రజలందరూ సహకరించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశ్వీరదించాలని ఆయన అభ్యర్థించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking