అందరికి  క్రీడ స్ఫూర్తి ఉంటే ఆరోగ్యంగా ఉంటారు గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతె శ్రీలత శోభన్ రెడ్డి.

హైదరబాద్ : ఈరోజు తార్నాక, లాలాపేట్ ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియం లో వెటరన్స్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ద్వారా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించారు, ఈ టోర్నమెంట్ లో గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతె శ్రీలత శోభన్ రెడ్డి మరియు బీ ఆర్ ఎస్ కార్మిక విభాగ అధ్యక్షుడు శ్రీ మోతె శోభన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరైన విజేతలకు బహుమానాలు అందజేశారు. డిప్యూటీ మేయర్ టేబుల్ టెన్నిస్ ఆడి ఆట మీద తమ ఉత్సాహం చూపుకున్నారు,

Greater Hyderabad City Deputy Mayor Mrs. Mote Srilata Shobhan Reddy said if everyone has the spirit of sports, they will be healthy.

ఈ టోర్నమెంట్లో వయసు కేటగిరి ఏది లేకుండా 13 వయసు నుంచి 75+ వరకు జరిగిన ఈ టోర్నమెంట్ లో 40 వయసు లోపు ఉన్న కేటిగేరీ లో 13 వయసు గల విలోహిత్ మొదటి స్థానం లో విజేత సాధించగా, ద్వితీయ స్థానం లో కునాల్ భార్గవ్ నిలిచాడు, 50+ క్యాటగిరి లో రామారావు మొదటి స్థానంలో విజేతగా నిలిచారు మరియు ద్వితీయ స్థానంలో విజయ్ కుమార్ నిలిచారు 60+ క్యాటగిరిలో ప్రథమ స్థానం మహమ్మద్ తాహిర్ నిలువగా, ద్వితీయ స్థానం లో అబ్బాస్ మొయిన్ద్దీన్ నిలిచారు 75+ క్యాటగిరిలో శ్రీనివాస్ ప్రథమ స్థానంలో నిలువగా, ద్వితీయ స్థానంలో దేవేందర్ నాథ్ నిలిచారు. డిప్యూటీ మేయర్ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ విజేతలకు బహుమతులో అందజేశారు, ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు కృష్ణ , విజయ్ కుమార్, విట్టల్, బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకులు సునీల్ ముదిరాజ్, నాగేశ్వరావు గౌడ్, ముదిరాజ్ మల్లికార్జున్ మరియు గూగుల్ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking