పటాన్‌చెరులో రూ.183 కోట్లతో 2000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమిపూజ
ఒక్కో మున్సిపాలిటీకి రూ.30 కోట్లు,
ప్రతి (3 కార్పొరేటర్) డివిజన్ లకు రూ.10 కోట్లు.
సీఎం ఫండ్ నుండి 55 గ్రామపంచాయతీలకు 15 లక్ష లు ప్రత్యేక అభివృద్ధి కొరకు మంజూరు చేసిన సీఎం కేసీఆర్.
సంగారెడ్డి జున్ 22 ప్రజ బలం ప్రతినిది:
సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు నియోజకవర్గంలోనిపటాన్ చెరువులోని మూడు మున్సిపాలిటీలకు గాను, ఒక్కో మున్సిపాలిటీకి రూ.30 కోట్లు, ప్రతి డివిజన్‌కు రూ.10 కోట్లు, నియోజకవర్గంలోని గ్రామపంచాయతీలకు 15 లక్షల చొప్పున ఇస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. రెవెన్యూ డివిజన్ కావాలని అడుగుతున్నారని.. తప్పకుండా నెరవేరుస్తామని చెప్పారు. పటాన్‌చెరులో రూ.183 కోట్లతో 2000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ గురువారం భూమిపూజ చేశారు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘పటాన్‌చెరు వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బాగా పనిచేస్తున్నారు. గతంలో పటాన్‌చెరులో కరెంట్ కోసం సమ్మెలు చేసేవారు. కానీ, ఇప్పుడు 24 గంటల విద్యుత్ వల్ల ఇక్కడి పరిశ్రమలు నిరంతరం 3 షిప్టుల్లో నడుస్తున్నాయి. పరిశ్రమలకు 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే. ఇక్కడ కాలుష్యం పెరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పటాన్‌చెరులో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి రావడంలో రాజీవ్‌శర్మ కృషి ఉంది. హరీశ్‌రావు వచ్చాక వైద్యరంగం పరుగులు పెడుతోంది. హైదరాబాద్ నలువైపులా 5 పెద్ద ఆస్పత్రులు వస్తున్నాయి.

*భూముల ధరలు ఏపీలోనే తగ్గాయి.
వచ్చే ఐదేళ్లలో పటాన్‌చెరు నుంచి హయత్‌నగర్ వరకు మెట్రో వస్తుంది. పటాన్‌చెరులో కాలనీలు బాగా పెరుగుతున్నాయి. ఇక్కడికి ఐటీ కంపెనీలు వచ్చేలా ప్రయత్నిస్తాం. రామసముద్రం చెరువును త్వరలోనే సుందరీకరిస్తాం. గతంలో ఏపీలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు కొనవచ్చని చంద్రబాబు అనేవారు. భూముల ధరల విషయంలో ఏపీ, తెలంగాణలో పరిస్థితి తారుమారైంది. ఇప్పుడు తెలంగాణలో భూముల ధరలు బాగా పెరిగాయి. ఏపీలో తగ్గాయి. మంచి ప్రభుత్వం, అభివృద్ధి పనులతో భూముల ధరలు పెరుగుతాయి’’ అని కేసీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు, విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి, చీఫ్ సెక్రటరీ శాంత కుమారి, మాజీ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ, రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింత ప్రభాకర్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి, పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జెడ్పి చైర్మన్ పర్సన్ శ్రీమతి మంజు శ్రీ, జిల్లా కలెక్టర్ శరత్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, మాణిక్ రావు, మరియు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు